కాసీరావ్ దంపతులు ఆ వార్త క్లిప్పింగ్ పట్టుకొని నిమ్స్ వైద్యులను ఆశ్రయించారు. తమ కుమారుడికి కూడా శస్త్రచికిత్స చేయాలని కోరారు. బాలుడికి వైద్యపరీక్షలు నిర్వహించిన డాక్టర్ బీరప్ప.. రోగికి వ్యాక్టరల్ సిండ్రోమ్ (పుట్టుకతోనే శరీరంలో అవయవలోపాలు) ఉన్నట్టు గుర్తించారు. ఇతడికి కూడా కొలనిక్ ఇంటర్ పొజిషన్ శస్త్రచికిత్స జరపాలని నిర్ణయించారు.
ఈనెల 5న బాలుడి కడుపులోని పెద్దపేగుతో అన్నవాహిక తయారు చేసి.. ఛాతి, మెడ మార్గం ద్వారా నోటిలోని అన్నవాహిక ప్రదేశానికి అనుసంధానం చేశారు. రూ.10 లక్షల ఖరీదైన ఈ శస్త్రచికిత్సను 8 మంది వైద్య నిపుణులతో 6 గంటల పాటు శ్రమించి విజయవంతంగా నిర్వహించారు. పూర్తిగా కోలుకోవటంతో వారం రోజుల్లోనే డిశ్చార్జి చేశారు.
కాగా, ఈ రెండు శస్త్రచికిత్సలకు సంబంధించిన జర్నల్స్‌ను ఇండియన్ మెడికల్ లిటరేచర్, ఇండియన్ మెడికల్ రిసెర్చ్ జనరల్‌కు పంపనున్నట్టు డాక్టర్ బీరప్ప తెలిపారు. ఈ శస్త్రచిక్సిత వివరాలు లిటరేచర్‌లో ప్రచురితమైతే ఇతర వైద్యులకు దోహదపడుతుందని వెల్లడించారు.