హైదరాబాద్, ఏప్రిల్ 7 (నమస్తే తెలంగాణ): బీఎస్సీ నర్సింగ్ ప్రవేశ పరీక్షను జూన్ 15న నిర్వహించనున్నట్టు ఇండియన్ నర్సింగ్ కౌన్సిల్ (ఐఎన్సీ) వెల్లడించింది. 202324 విద్యాసంవత్సర అకడమిక్ క్యాలెండర్ను శుక్రవారం ఐఎన్సీ కార్యదర్శి సర్వజిత్ కౌర్ విడుదల చేశారు.
ఆగస్టు 1న అకడమిక్ సెషన్ ప్రారంభమవుతుందని, అడ్మిషన్లకు తుది గడువును సెప్టెంబర్ 30గా నిర్ణయించామని తెలిపారు. దేశవ్యాప్తంగా అన్ని రాష్ర్టాలు ఈ అకడమిక్ క్యాలెండర్ను అనుసరించాలని సూచించారు.