Weather update | హైదరాబాద్, జూన్ 15 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో రాబోయే మూడు రోజుల పాటు అధిక ఉష్ణోగ్రతలు 40 నుంచి 45 డిగ్రీల వరకు నమోదవుతాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఎండలతో పాటు వడగాలులు వీస్తాయని తెలిపింది.
దీంతో ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఈ నెల 19 వరకు రాష్ట్రంలోకి నైరుతి రుతుపవనాలు వచ్చే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. ఇదిలా ఉండగా రాష్ట్రంలో రాగల 3 రోజులు అక్కడక్కడ తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నదని వెల్లడించింది.