‘గిన్నిస్’ రికార్డు గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌కు అంకితం
మంత్రి శ్రీనివాస్ గౌడ్ | గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్‌కు మహబూబ్ నగర్ జిల్లాలోని దేశంలోనే అతిపెద్ద కేసీఆర్ ఎకో అర్బన్ పార్క్ ( 2097 ఎకరాలు) వేదికైంది.

మహబూబ్‌నగర్ : గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్‌కు మహబూబ్ నగర్ జిల్లాలోని దేశంలోనే అతిపెద్ద కేసీఆర్ ఎకో అర్బన్ పార్క్ ( 2097 ఎకరాలు) వేదికైంది. జిల్లాకు చెందిన మహిళా సమాఖ్యకు చెందిన మహిళలు 10 రోజుల్లో 2 కోట్ల 8 లక్షల విత్తన బంతులను తయారు చేశారు. వాటిని గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా సోమవారం కేసీఆర్ ఎకో అర్బన్ పార్క్ లోని మైదాన ప్రాంతాల్లో వెద జల్లే కార్యక్రమంలో మంత్రి శ్రీనివాస్ గౌడ్ , గ్రీన్ ఇండియా ఛాలెంజ్ రూపకర్త, ఎంపీ సంతోష్ కుమార్ ముఖ్య అతిథిలుగా పాల్గొని విజయవంతం చేశారు.
ఈ రికార్డును గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌కు అంకితం ఇస్తునట్లు మంత్రి శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. ఈ చారిత్రాత్మక ఘట్టానికి కృషి చేసిన కలెక్టర్, అదనపు కలెక్టర్లు, జిల్లా అధికార యంత్రాంగం, జిల్లా సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ సభ్యులకు, గిన్నిస్ వరల్డ్ రికార్డ్ బృందానికి మంత్రి కృతజ్ఞతలు తెలిపారు.
కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఎస్ వెంకట్రావు, ఎస్పీ వెంకటేశ్వర్లు, ఆదనపు కలెక్టర్ తేజాస్ నందులాల్ పవర్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రాజేశ్వర్ గౌడ్, మున్సిపల్ చైర్మన్ కేసీ నర్సింహులు, వైస్ చైర్మన్ గణేష్, గ్రీన్ ఇండియా ప్రతినిధులు రాఘవ, వెంకటేష్, డీఎఫ్‌వో గంగిరెడ్డి, మాజీ మార్కెట్ చైర్మన్ రాజేశ్వర్, అటవీశాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు.

ఇవి కూడా చదవండి..
గోదావరిలో మునిగిన పురాతన శివాలయం
బైక్‌ను ఢీ కొట్టిన డీసీఎం..ఒకరి మృతి
శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు భారీ ఇన్ ఫ్లో
మేలో పెళ్లి.. తాజాగా ప్రెగ్నెంట్ అని ప్రకటించిన సాహోబ్యూటీ
బీజేపీ నుంచి టీఆర్ఎస్లోకి భారీగా చేరికలు
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
టెన్త్‌లో టాపర్లకు ఢిల్లీ విమాన ప్రయాణ బహుమతి
రోడ్లపై బైక్ స్టంట్లు చేస్తున్న యువకుడిపై కేసు నమోదు
FMG Doctor | రాజస్థాన్‌లో 15 రోజుల్లోనే జీవో పాసైంది.. మన దగ్గరే ఎందుకు ఆలస్యం..?: కాంగ్రెస్ సర్కార్‌పై ఎఫ్ఎంజీ డాక్టర్ ఫైర్
‘నవంబర్ 29న మున్నూరు కాపు కార్తీకమాస వన సమారాధన’
‘కళాకారులు, కళను ప్రోత్సహించడం అందరి బాధ్యత’
ట్రెండింగ్ వార్తలు
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం

