సాహో ఫేం ఎవ్ లీన్ శర్మ తన స్నేహితుడు తుషాన్ భిండిని మే 15న వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. సాధారణ స్నేహితుడు ఏర్పాటు చేసిన బ్లైండ్ డేట్ లో 2018 లో వీరిద్దరు కలుసుకోగా, ఆ తర్వాత ప్రేమలో పడ్డారు. 2019 అక్టోబర్ లో నిశ్చితార్థం చేసుకున్నారు. సిడ్నీ హార్బర్ బ్రిడ్జ్ వద్ద అతను ప్రపోజ్ చేశాడు. గిటార్ వాద్యకారుడు ఒక మోకాలిపై ఉన్న చందంగా తమ ఫేవరెట్ పాటలను ప్లే చేస్తూ ప్రపోజ్ చేశాడు.
పెళ్లై రెండు నెలలు కూడా కాలేదు. అప్పుడు ఎవెలిన్ శర్మ తన గర్భధారణ విషయంపై ప్రకటన విడుదల చేసింది. తన అంతర్జాలంలో బేబి బంప్పై చేయి పెట్టుకొని ఉన్న ఫొటోని షేర్ చేసిన ఎవెలిన్..నిన్ను నా చేతుల్లో పట్టుకొని ఉండడం కోసం వేచి ఉండలేను అని కామెంట్ రూపంలో పేర్కొంది. జూలై 12 న తన పుట్టినరోజు. ఈ సందర్భంగా అభిమానుల చెవిలో శుభవార్త వేస్తున్నందున ఇదే తనకు ఉత్తమ బహుమతి
అని ఆనందం వ్యక్తం చేసారు ఎవెలిన్.