ఆదర్శప్రాయం పూలే జీవితం
సామాజిక సంస్కరణలతో చరిత్రకెక్కిన మహనీయులు మహాత్మా జ్యోతిరావ్ పూలే, సావిత్రిబాయి పూలే జీవిత కథ ఆధారంగా రూపొందించిన చిత్రం ‘పూలే’.
సామాజిక సంస్కరణలతో చరిత్రకెక్కిన మహనీయులు మహాత్మా జ్యోతిరావ్ పూలే, సావిత్రిబాయి పూలే జీవిత కథ ఆధారంగా రూపొందించిన చిత్రం ‘పూలే’. ప్రతీక్‌గాంధీ, పత్రలేఖ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రానికి అనంత్ మహదేవన్ దర్శకత్వం వహించారు. సుపదా క్రియేషన్స్ పతాకంపై డా॥ పొన్నం రవిచంద్ర నిర్మించారు. ఏషియన్ సినిమాస్ ద్వారా సునీల్ నారంగ్ ఈ నెల 27న ప్రేక్షకుల ముందుకుతీసుకొస్తున్నారు.
ఈ సందర్భంగా మంగళవారం ఏర్పాటు చేసిన సమావేశంలో చిత్ర నిర్మాత పొన్నం రవిచంద్ర మాట్లాడుతూ..జ్యోతిరావ్‌పూలే, సావిత్రిబాయి పూలే చరిత్రను నేటి మహిళలు తప్పకుండా తెలుసుకోవాల్సిన అవసరం ఉందని, తెలుగులో ఈ చిత్రాన్ని తీసుకురావడం ఆనందంగా ఉందని చెప్పారు. పూలే దంపతులు జీవితం అందరికీ ఆదర్శప్రాయమని, మహిళా విద్య, సమాన హక్కులు, సామాజిక న్యాయం కోసం వారు అలుపెరుగని పోరాటం చేశారని రచయిత పసునూరి రవీందర్, సామాజిక కార్యకర్త విమలక్క పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో టీఎఫ్‌సీసీ ఛైర్మన్ ప్రతాని రామకృష్ణ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Rahul Gandhi | నా తండ్రిని చంపడానికే ఆయన భద్రతను తొలగించారు.. అప్పటి కేంద్ర సర్కారుపై రాహుల్‌గాంధీ ఆరోపణ..!
Watch: ఇద్దరు వరులను ఆశ్చర్యపరిచిన బావ.. కోటి విలువైన కరెన్సీ దండలు బహూకరణ
Watch: అసదుద్దీన్ ఒవైసీని సుప్రీంకోర్టు జడ్జిగా పొరబడిన పోలీసులు.. గౌరవ వందనం సమర్పణ
Watch: ఆసుపత్రిలో నిద్రిస్తున్న మహిళను వేధించిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: వైద్య విద్యార్థినిని.. కాలేజీ క్యాంపస్ నుంచి కిడ్నాప్ చేసిన కుటుంబ సభ్యులు, వీడియో వైరల్

