హైదరాబాద్, ఆగస్టు 29(నమస్తే తెలంగాణ): తెలంగాణ బ్రాహ్మణ సంక్షేమ పరిషత్తు సభ్యుడిగా సీనియర్ పాత్రికేయుడు, హైదరాబాద్‌లోని కొత్తపేటకు చెందిన విష్ణుదాస్ శ్రీకాంత్‌ను నియమిస్తూ మంగళవారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది.
బొగ్గులకుంటలోని బ్రాహ్మణ సంక్షేమ పరిషత్తు కార్యాలయంలో చైర్మన్ డాక్టర్ రమణాచారి ఆయనకు నియామక ఉత్తర్వులు అందించి సత్కరించారు. తనను బ్రాహ్మణ సంక్షేమ పరిషత్తు సభ్యుడిగా నియమించినందుకు ముఖ్యమంత్రి కేసీఆర్‌కు, రమణాచారికి విష్ణుదాస్ శ్రీకాంత్ ధన్యవాదాలు తెలియజేశారు.