హైదరాబాద్, సెప్టెంబర్30 (నమస్తే తెలంగాణ): బీహెచ్ఎంఎస్, బీఎస్సీ నర్సింగ్, తదితర పారా మెడికల్ కోర్సుల ప్రవేశాల్లోనూ లోకల్ కోటాను అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు వైద్యారోగ్య, కుటుంబ సంక్షేమశాఖ శనివారం ఉత్తర్వులు జారీ చేసింది.
బీహెచ్ఎంఎస్, బీఎస్సీ నర్సింగ్, ఎండీ హోమియో, పీజీ పారామెడికల్ తదితర వైద్య అనుబంధ కోర్సుల ప్రవేశాల్లో ఎంబీబీఎస్ సీట్ల కేటాయింపులో అమలు చేసిన లోకల్ కోటా నిబంధనే అమలు కానున్నది. కాళోజీ నారాయణరావు హెల్త్ యూనివర్సిటీ చేసిన ప్రతిపాదనలకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది.