హైదరాబాద్, జనవరి 30 (నమస్తే తెలంగాణ)/సిటీబ్యూరో: ప్రముఖ ప్రజా గాయకుడు దివంగత గద్దర్ విగ్రహ ఏర్పాటుకు సంగారెడ్డి జిల్లా పరిధిలోని తెల్లాపూర్ గ్రామంలో 1,076 గజాల భూమిని ప్రభుత్వం కేటాయించింది.
ఈ మేరకు మంగళవారం మున్సిపల్ వ్యవహారాలు, పట్టణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి దానకిషోర్ ఆదేశాలు జారీ చేశారు. ఆ గ్రామంలోని సర్వే నెంబర్ 323/14లో హెచ్ఎండీఏ భూమిని కేటాయించి, ప్రక్రియను పూర్తి చేయాలని హెచ్ఎండీఏకి సూచించారు.