కుట్ర ఎవరిది?.. ఓట్ల తొలగింపునకు ఫారం-7 అస్త్రం!
‘సర్'లో వచ్చిన దరఖాస్తులు 24,323 అభ్యంతరాలతో తొలగించిన ఓట్లు 12,204.. అన్ని నియోజకవర్గాల నుంచీ అభ్యంతరాలు.. బల్ దరఖాస్తుల దాఖలుపై అనుమానాలు.. ముషీరాబాద్‌లో బీఎల్ఏపై చర్యలకే పరిమితమా?.. రెండు జాతీయ పార్టీల పాత్రపై ఆరోపణలు
హైదరాబాద్, అక్టోబర్ 9 (నమస్తే తెలంగాణ): ఓటు హకు ప్రజాస్వామ్యానికి పునాది. కానీ, అదే ఓటును తొలగించాలని పెద్ద సంఖ్యలో దరఖాస్తులు వెల్లువెత్తితే..? ఒకరి ఓటు అర్హతపై మరొకరు అభ్యంతరం చెప్పే ఫారం-7నే రాజకీయ అస్త్రంగా ఉపయోగిస్తున్నారనే ఆరోపణలు వస్తే..? తెలంగాణలో ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియలో ఫారం-7 దరఖాస్తుల వ్యవహారం ఇప్పుడు ఈ ప్రశ్నలనే లేవనెత్తుతున్నది. రాష్ట్రవ్యాప్తంగా ఈ నెల 7వ తేదీ వరకు ఫారం-7 ద్వారా 24,323 దరఖాస్తులు అందగా, వాటి ఆధారంగా 12,204 ఓట్లను తొలగించినట్టు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (సీఈవో) కార్యాలయం వెల్లడించింది.
ఇంత పెద్ద సంఖ్యలో అభ్యంతరాలు రావడం, కొన్ని ప్రాంతాల్లో దరఖాస్తులను ఒకరిద్దరే సమర్పించినట్టు ఆరోపణలు రావడం, చర్యలు తీసుకున్న తీరుపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా వచ్చిన 24,323 దరఖాస్తుల్లో ఎన్ని వ్యక్తిగతంగా, ఎన్ని బల్గా సమర్పించారు? ఒకే వ్యక్తి లేదా సంస్థ సమర్పించిన దరఖాస్తుల సంఖ్య ఎంత? 12,204 ఓట్ల తొలగింపునకు ఏయే కారణాలు నమోదయ్యాయి? తొలగించిన ఓటర్లకు నోటీసులు ఇచ్చారా? తమ వాదన వినిపించే అవకాశం కల్పించారా?
తప్పుడు సమాచారం ఇచ్చినట్టు గుర్తించిన దరఖాస్తుదారులపై ఏమి చర్యలు తీసుకున్నారు? ముషీరాబాద్ మాదిరిగా ఇతర ప్రాంతాల్లోనూ విచారణలు, చర్యలు జరిగాయా? ఓటర్ల జాబితా నుంచి తొలగించిన పేర్లపై అప్పీల్ లేదా పునఃపరిశీలనకు ఉన్న మార్గాలేమిటి? వంటి వివరాలపై ఎన్నికల అధికారులు స్పష్టమైన సమాధాలు ఇవ్వాల్సి ఉన్నది. ఓ జాతీయ పార్టీకి చెందిన నాయకులు ఓ వర్గం ఓట్లను తొలగించేందుకు కుట్ర చేశారా? అనే అనుమానాలను కూడా నివృత్తి చేయాల్సి ఉన్నది.
హైదరాబాద్ నుంచే అత్యధికంగా 6,335
రాష్ట్రంలో ‘సర్’ ప్రక్రియలో భాగంగా క్లెయిమ్స్, అభ్యంతరాలు స్వీకరించే గడువు ఈ నెల 7వ తేదీతో ముగిసే నాటికి ఫారం-7 ద్వారా 24,323 దరఖాస్తులు వచ్చాయి. ఈ అభ్యంతరాలను పరిశీలించిన అనంతరం 12,204 ఓట్లను తొలగించినట్టు సీఈవో కార్యాలయం స్పష్టంచేసింది. హైదరాబాద్ వంటి నగర ప్రాంతాలతోపాటు కొన్ని వర్గాలు ఎక్కువగా ఉండే ప్రాంతాల నుంచి ఫారం-7 ద్వారా అభ్యంతరాలు రావడం అనుమానాలకు తావిస్తున్నది. హైదరాబాద్‌లో అత్యధికంగా 6,335 ఫారం-7 దరఖాస్తులు అందాయి. రంగారెడ్డిలో 2,223, మేడ్చల్-మలాజిగిరిలో 1,749, పెద్దపల్లిలో 1,737, కరీంనగర్లో 1,390, హనుమకొండలో 1,281, నిజామాబాద్‌లో 1,173 దరఖాస్తు లు వచ్చాయి. ఈ జాబితాలో హైదరాబాద్ మొదటి స్థానంలో ఉండటం గమనార్హం. అయితే, పట్టణ ప్రాంతాల్లో జనాభా చలనం, చిరునామాల మార్పు లు, మరణాల నమోదు, డూప్లికేట్ ఎంట్రీలు వంటి అంశాలు కూడా ఫారం-7 దరఖాస్తులకు కారణమవుతాయి.
బల్ దరఖాస్తుల వెనుక ఎవరు?
రాష్ట్రంలోని పలు నియోజకవర్గాల్లో ఒకే వర్గానికి చెందిన ఓటర్లను లక్ష్యంగా చేసుకొని పెద్ద సంఖ్యలో ఫారం-7 దరఖాస్తులు సమర్పించినట్టు ఆరోపణలు వచ్చాయి. ఒక జాతీయ పార్టీకి చెందిన కొందరు నాయకులు ఈ వ్యవహారంలో ఉన్నారనే ఆరోపణలు కూడా వినిపించాయి. ముషీరాబాద్ నియోజకవర్గంలో ఇలాంటి దరఖాస్తులు ఎకువగా వచ్చినట్టు సీఈవో గణాంకాలు వెల్లడిస్తున్నాయి. ఈ నేపథ్యం లో అకడ వచ్చిన దరఖాస్తుల సంఖ్య ఎంత? వాటి లో ఎన్ని ఒకే వ్యక్తి లేదా సంస్థ ద్వారా అందాయి? ఒకే తరహా అభ్యంతరాలు ఎన్ని ఉన్నాయి? వాటిపై అధికారులు ఏ చర్యలు తీసుకున్నారు? అనేది అధికారులు స్పష్టంచేయాల్సి ఉన్నది.
ముషీరాబాద్ నియోజకవర్గంలో ఓ జాతీయ పార్టీకి చెందిన ఒక బూత్ లెవల్ ఏజెంట్ (బీఎల్ఏ) ఫారం-7పై 31 అభ్యంతరాలు సమర్పించినందుకు అతడిపై కేసు నమోదుకు పోలీసులకు ఫిర్యాదు చేసినట్టు ఎన్నికల అధికారులు తెలిపారు. అయితే, ఇతర ప్రాంతాల్లోనూ ఇలాంటి ఫిర్యాదులు లేదా అనుమానాస్పద దరఖాస్తులు వచ్చినట్లయితే వాటిపై ఎలాంటి విచారణ జరిగింది? ఎన్ని కేసులు నమోదు చేశారు? ఎన్ని దరఖాస్తులను తిరసరించారు? ఎన్ని ఓట్ల తొలగింపును నిలిపివేశారు? అనే వివరాలు స్పష్టంగా తెలియాల్సి ఉన్నది.
రెండు జాతీయ పార్టీల కుమ్మకా?
రెండు జాతీయ పార్టీలు కుమ్మకై తెలంగాణ ఉద్యమకారులు, స్థానికంగా నివసిస్తున్న హైదరాబాదీల ఓట్లను తొలగించే కుట్ర చేస్తున్నారని బీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తున్నారు. ఫారం-7ను అస్త్రంగా ఉపయోగించి ఒక వర్గం ఓటర్ల పేర్లను తొలగించాలని చూస్తున్నారని చెప్తున్నారు. హైదరాబాద్‌లో చనిపోయిన భర్త.. బతికున్న భార్య ఓటును తొలగించాలని ఫారం-7 సమర్పించినట్టు ఇటీవల వెలుగులోకి వచ్చిన అంశాన్ని ప్రస్తావించారు. ఈ వ్యవహారంపై విచారణకు ఆదేశించినట్టు సీఈవో కార్యాలయ అధికారులు వెల్లడించారు. ఈ ఘటన నిజమని విచారణలో తేలితే, ఫారం-7 దరఖాస్తుల పరిశీలనలో ఎంతటి జాగ్రత్త అవసరమో స్పష్టమవుతుంది. వ్యక్తి వివరాలు, ఓటరు గుర్తింపు సంఖ్య, సంబంధిత రికార్డులను సరిచూసుకోకుండా నిర్ణయం తీసుకుంటే అర్హులైన ఓటర్లు హకును కోల్పోయే ప్రమాదం ఉంటుంది. ఫారం-7 దరఖాస్తుల వెనుక ఉన్న ని జానిజాలను వెలికితీసి, తప్పుడు దరఖాస్తులపై చర్య లు తీసుకొని, అర్హులైన ప్రతి ఓటరుకూ న్యాయం జరిగేలా చూడాలని బీఆర్ఎస్ కోరుతున్నది.
జిల్లాల వారీగా ఫారం-7 దరఖాస్తులు
- హైదరాబాద్ 6,335
- రంగారెడ్డి 2,223
- మేడ్చల్ -మలాజిగిరి 1,749
- పెద్దపల్లి 1,737
- కరీంనగర్ 1,390
- హనుమకొండ 1,281
- నిజామాబాద్ 1,173
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

