అటవీ భూములు అన్యాక్రాంతం
మంచిర్యాల జిల్లా భీమారం మండలం కుందారం రిజర్వ్ ఫారెస్టులో దాదాపు వంద ఎకరాలను కబ్జా చేసేందుకు కాంగ్రెస్ నాయకులు భారీ స్కెచ్ వేశారు. పొలంపల్లి, తాళ్లగూడెం, భీమారం గ్రామాల నేతలకు ఆ భూములను హస్తగతం చేసుకొనేందుకు కుట్రపన్నుతున్నారు.
- వంద ఎకరాల కబ్జాకు కాంగ్రెస్ నాయకుల స్కెచ్
- పొలంపల్లి, తాళ్లగూడెం, భీమారం నేతల హస్తం
- ఫేక్ డాక్యుమెంట్లతో 30 ఎకరాలపై కోర్టుకు..
- ఆ 100 ఎకరాలు మావే అంటున్న అటవీశాఖ
మంచిర్యాల, మే 22 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): మంచిర్యాల జిల్లా భీమారం మండలం కుందారం రిజర్వ్ ఫారెస్టులో దాదాపు వంద ఎకరాలను కబ్జా చేసేందుకు కాంగ్రెస్ నాయకులు భారీ స్కెచ్ వేశారు. పొలంపల్లి, తాళ్లగూడెం, భీమారం గ్రామాల నేతలకు ఆ భూములను హస్తగతం చేసుకొనేందుకు కుట్రపన్నుతున్నారు.
ఫేక్ డాక్యుమెంట్లతో 30 ఎకరాలపై ఇప్పటికే కోర్టుకు వెళ్లారు. చెన్నూర్ ఫారెస్టు రేంజ్ పరిధిలోని భీమారం మండలం తాళ్లగూడెం గ్రామం అంకుశాపూర్ శివారులోని 140 సర్వే నంబర్లో 559 ఎకరాల అటవీ భూమి ఉన్నది. ఇందులో కొన్ని ఎకరాలను స్థానిక రైతులు ఎన్నో ఏండ్ల్లుగా పోడు చేసుకుంటున్నారని ఆరోపిస్తూ అటవీశాఖ భూములకు ట్రెంచ్ తీసేందుకు వెళ్లిన ఫారెస్టు అధికారులను సోమవారం అధికార పార్టీ లీడర్లు అడ్డుకున్నారు.
పోడు చేసుకుంటున్నట్టు ఆధారాలు చూపించండి.. అని అడిగితే.. ‘మాకు నోటీసులు ఇవ్వండి.. మేం కోర్టుకు పోతాం’ అంటూ వితండవాదం చేశారు. ఫారెస్టు ఆఫీసర్ల విధులకు ఆటంకం కలిగించారు. ట్రెంచ్ వేసేప్పుడు తాళ్లగూడెం మాజీ సర్పంచ్ (కాంగ్రెస్ లీడర్) కుటుంబం తప్ప.. వేరే వాళ్లు ఎవ్వరూ ఇక్కడికి అడ్డుకోడానికి రాలేదని ఫారెస్టు అధికారులు చెప్తున్నారు. ఇదే మండలంలోని అటవీ భూములను అధికార పార్టీ నాయకులు కబ్జాకు ప్రయత్నిస్తుండటంపై ‘నమస్తే తెలంగాణ’ ప్రత్యేక కథనం..
100 ఎకరాలకు పక్కా స్కెచ్.. ఇప్పటికే 40 ఎకరాల్లో పాగా..
అంకుశాపూర్ శివారులోని 140 సర్వే నంబర్‌తోపాటు భీమారం మండలం పొలంపల్లిలోని 286, 292 సర్వే నంబర్లలో 30 హెక్టార్లు అంటే దాదాపు 100 ఎకరాల భూమిని కబ్జా చేసే దిశగా అధికార పార్టీ నాయకులు పావులు కదుపుతున్నారు. పొలంపల్లిలో సైతం మాజీ సర్పంచ్ కనుసన్నల్లోనే ఈ తతంగం నడుస్తున్నట్టు తెలుస్తున్నది.
ఇప్పుటికే అటు తాళ్లగూడెం, పొలంపల్లి మాజీ సర్పంచులు ఈ సర్వే నంబర్లలోనే దాదాపు 40 ఎకరాల అటవీ భూమిని కబ్జా చేసి ఆ భూములు తమవేనంటూ కోర్టులో కేసు వేసినట్టు తెలిసింది. కోర్టు కేసులు ఉండటంతో ఇప్పుడా 40 ఎకరాల పరిస్థితి ఏమిటనే విషయంపై అటవీశాఖ అధికారులు మౌనం వహిస్తున్నారు. ముమ్మాటికీ ఆ భూములు అటవీశాఖకు చెందినవే అంటున్నారు. న్యాయస్థానంలోనే దాన్ని రుజువు చేస్తామని చెప్తున్నారు.
ఇందుకు తమ దగ్గర ఆధారాలను ఉన్నాయని చెప్తున్నారు. తాళ్లగూడెం గ్రామం అంకుశాపూర్ శివారులోని సర్వే నంబర్ 140లో 559 ఎకరాల అటవీ భూమి తప్ప, రెవెన్యూ ల్యాండ్ ఒక్క గుంట కూడా లేదని, ఈ విషయంపై ఇప్పటికే రెవెన్యూ అధికారులు సైతం స్పష్టత ఇచ్చారని చెప్తున్నారు. పొలంపల్లి శివారులోని 286 సర్వే నంబర్లోని 30 ఎకరాల భూమిలో అటవీశాఖ మొక్కలు పెట్టిందన్నారు. ఆ భూమిలోని చెట్లనే దాదాపు రెండు నెలల క్రితం ఎవరో నరికివేశారని.. అందులోనూ అధికార పార్టీకి చెందిన ఓ నాయకుడే ఉన్నట్టు తమకు సమాచారం ఉన్నదని అటవీశాఖ అధికారులు తెలిపారు.
దానికి ఆధారాలు సేకరిస్తున్నామని, వాటిని కోర్టులో సమర్పించాకే ఆ 40 ఎకరాల విషయంలో స్పందిస్తామని చెప్తున్నారు. ఈ మొత్తం వ్యవహారంలో అధికార కాంగ్రెస్ నాయకులకు గతంలో భీమారం ఇన్చార్జి, ఎఫ్ఎస్వోగా పనిచేసిన ఓ అధికారి సహకరిస్తున్నట్టు తెలుస్తున్నది. ఎక్కడ ఎలా చేస్తే భూములను ఆక్రమించవచ్చు. ఉన్నతాధికారులు వచ్చినప్పుడు ఏం మాట్లాడాలి. కోర్టులో ఎలాంటి కేసులు వేయాలని సదరు అధికారే వారిని ముందుండి నడిపిస్తున్నారనే గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ ఇంటి దొంగ విషయంలో అటవీశాఖ సైతం సీరియస్‌గా ఉన్నట్టు తెలిసింది. భూముల విషయం కొలిక్కి వచ్చాక సదరు అధికారిపై వేటు వేసే అవకాశాలు ఉన్నట్టు చెప్తున్నారు.
వారిదగ్గర ఎలాంటి ఆధారాల్లేవ్ : రత్నాకర్‌రావు, ఎఫ్ఆర్వో, మంచిర్యాల
అటవీశాఖ, రెవెన్యూ బార్డర్లో ప్రొటెక్షన్ ట్రెంచ్‌లు కొట్టమని ఉన్నతాధికారులు ఆదేశించారు. దాంతో అంకుశాపూర్ శివారులోని 140 సర్వే నంబర్లో రిజర్వ్ ఫారెస్టులో ట్రెంచ్ కొడుతున్నాం. ఆ ట్రెంచ్‌లు కొట్టేప్పుడు ఎవరన్నా ఆర్వోఎఫ్ఆర్ లేదా హక్కు పత్రాలు ఉన్నోళ్లు ఉంటే వదిలేస్తాం. కానీ, ఇప్పుడు ఎవరైతే అడ్డుకుంటున్నారో వాళ్ల దగ్గర ఆర్వోఎఫ్ఆర్గానీ, హక్కు పత్రాలుగానీ ఏవీ లేవు. మంగళవారం వచ్చి అడ్డుకున్నారు. కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లాం. ట్రెంచ్ కొట్టడం మొదలుపెట్టాం. మీరన్నట్టు 40 ఎకరాలపై కోర్టులో స్టే ఉన్నది. ఆ స్టే వెకేటయ్యాకే వాటి గురించి మాట్లాడుతాం. కాకపోతే ఆ 40 ఎకరాలు కూడా అటవీశాఖ భూమి అని నిరూపించేందుకు ఆధారాలు మా దగ్గర ఉన్నాయి. న్యాయస్థానంలో సమర్పించాకే తదుపరి చర్యలు ఉంటాయి.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Exercise | పీసీఓఎస్ వంటి సమస్యలు ఉన్న మహిళలు చేయాల్సిన వ్యాయామాలు ఇవే..
Boyfriend Falls From Balcony | నాలుగో అంతస్తు నుంచి కిందపడి వ్యక్తి మృతి.. ఇన్ఫ్లుయెన్సర్ అయిన ప్రియురాలిపై అతడి తల్లి ఫిర్యాదు
Vaccine | శీతాకాలంలో వీరికి శ్వాసకోశ సమస్యల ముప్పు ఎక్కువ.. టీకా తీసుకోవాలంటున్న వైద్యులు..
Nuclear War | మానవాళికి ఏఐ, న్యూక్లియర్ ముప్పు.. 2100లోపు మానవాళి అంతం తప్పదా
New Districts | కొత్త జిల్లాల ఏర్పాటు చారిత్రాత్మక ఘట్టం.. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

