హైదరాబాద్, ఏప్రిల్ 20 (నమస్తే తెలంగాణ) : యూపీఎస్సీ సివిల్స్ తుది ఫలితాలు ఒకట్రెండు రోజుల్లో విడుదలయ్యే అవకాశాలున్నాయి. విశ్వసనీయ సమాచారం మేరకు సోమవారం లేదా మంగళవారం ఫలితాలు విడుదలకానున్నాయి. అఖిల భారత సర్వీసుల్లోని 1,056 పోస్టుల భర్తీకి యూపీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసింది. జూన్ 16న ప్రిలిమ్స్ పరీక్షను నిర్వహించగా, సెప్టెంబర్ 20 -29 వరకు మెయిన్స్ పరీక్షలను నిర్వహించారు. జనవరి 7 నుంచి ఈ నెల 17 వరకు ఇంటర్వ్యూలు జరిగాయి.