హైదరాబాద్, ఆగస్టు 20 (నమస్తే తెలంగాణ): డాక్టర్ బీఆర్ అంబేద్కర్ రాష్ట్ర సచివాలయం గురువారం రిటైర్డ్ ఐఏఎస్ అధికారులతో సందడిగా మారింది. 1984 బ్యాచ్ రిటైర్డ్ ఐఏఎస్ అధికారులంతా వారి కుటుంబాలతో సహా సచివాలయానికి వచ్చారు. సచివాలయాన్ని పరిశీలించిన తర్వాత సెల్ఫీలు దిగారు.
సచివాలయానికి వచ్చిన వారిలో మాజీ సీఎస్ ఎస్కే జోషి, రేమండ్ పీటర్, నాగిరెడ్డి, రామచంద్రుడు నాయక్, శ్యాంబాబు, విద్యాసాగర్, సుకుమార్ తదితరులు ఉన్నారు.