పరిహారం తేల్చాకే సర్వే చేయాలి
కేపీ లక్ష్మీదేవిపల్లి ప్రాజెక్టు భూసేకరణలో ఎకరాకు ఎంత పరిహారం చెల్లిస్తారో తేల్చాకే సర్వే చేపట్టాలంటూ రైతు లు అధికారులను అడ్డుకున్నారు. గురువారం మండలంలోని సయ్యద్‌పల్లి శివారులో తహసీల్దార్ వెంకటేశ్వరితోపాటు అధికారులు సర్వే చేసేందుకు పోలీస్ బందోబస్తుతో వెళ్లా రు.
- కేపీ లక్ష్మీదేవిపల్లి ప్రాజెక్టు సర్వేను అడ్డుకున్న రైతులు
పరిగి, ఆగస్టు 20 : కేపీ లక్ష్మీదేవిపల్లి ప్రాజెక్టు భూసేకరణలో ఎకరాకు ఎంత పరిహారం చెల్లిస్తారో తేల్చాకే సర్వే చేపట్టాలంటూ రైతు లు అధికారులను అడ్డుకున్నారు. గురువారం మండలంలోని సయ్యద్‌పల్లి శివారులో తహసీల్దార్ వెంకటేశ్వరితోపాటు అధికారులు సర్వే చేసేందుకు పోలీస్ బందోబస్తుతో వెళ్లా రు. అక్కడ రైతులు తమ భూములు సారవంతమైనవని, ఎకరానికి ఎంత పరిహారం ఇస్తారో తేల్చకుండా సర్వే ఎలా చేస్తారంటూ అధికారులను నిలదీశారు. గ్రామసభ నిర్వహించి ఎకరాకు ఎంత పరిహారం అందజేస్తారన్నది ఉన్నతాధికారులు తేల్చాలన్నారు. ప్రభుత్వ విలువ ఎకరాకు రూ.8.40 లక్షలు ఉందని, తమకు పది రెట్లు ఎక్కువగా ఎకరాకు రూ.80 లక్షలు పరిహారంగా ఇవ్వాలని రైతులు డిమాండ్ చేశారు.
అప్పటివరకు సర్వే చేయొద్దని తేల్చి చెప్పారు. ఈ విషయంలో తాను ఏమి చేయలేనని, ఉన్నతాధికారులకు వివరిస్తానని తహసీల్దార్ తెలిపా రు. లక్ష్మీదేవిపల్లి ప్రాజెక్టు కోసం తమ గ్రామానికి చెందిన వెయ్యి ఎకరాలు భూమి పోతుందని.. లక్ష్మీదేవిపల్లి నుంచి ఒక్క ఎకరా భూ మి కూడా పోవడం లేదని అలాంటప్పుడు ఆ ప్రాజెక్టుకు లక్ష్మీదేవిపల్లి పేరు ఎందుకు పెడతారని రైతులు ప్రశ్నించారు. అధిక మొత్తంలో భూములు కోల్పోతున్న తమ గ్రామం పేరు ప్రాజెక్టుకు పెట్టాలని వారు డిమాండ్ చేశారు. కలెక్టర్, స్థానిక ఎమ్మెల్యే చొరవ తీసుకొని భూములకు ఆమోదయోగ్యమైన ధర నిర్ణయించాలని వారు డిమాండ్ చేశారు. రైతుల అడ్డగింతతో అధికారులు సర్వే చేయకుండా వెనుదిరిగారు.
Read Today's Latest Rangareddy News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Health tips | మైదా అతిగా తింటున్నారా.. అయితే మీరు కచ్చితంగా ఈ విషయం తెలుసుకోవాల్సిందే..!
Manjeera Water | నిర్లక్ష్యపు తవ్వకాలతో నగరంలో మంజీరా జలాలు వృథా
Earthquake | హిందూ మహాసముద్రంలో భూకంపం.. రిక్టర్ స్కేలుపై 6.4 తీవ్రత నమోదు..!
MLA Madhavaram krishna rao | హెచ్ఎండీఏ కార్యాలయ ముట్టడి.. సక్సెస్ చేయాలని ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు పిలుపు
కాచిరాజుగూడెంలో కోడి పందాలపై పోలీసుల రైడ్
ట్రెండింగ్ వార్తలు
Rahul Gandhi | నా తండ్రిని చంపడానికే ఆయన భద్రతను తొలగించారు.. అప్పటి కేంద్ర సర్కారుపై రాహుల్‌గాంధీ ఆరోపణ..!
Watch: ఇద్దరు వరులను ఆశ్చర్యపరిచిన బావ.. కోటి విలువైన కరెన్సీ దండలు బహూకరణ
Watch: అసదుద్దీన్ ఒవైసీని సుప్రీంకోర్టు జడ్జిగా పొరబడిన పోలీసులు.. గౌరవ వందనం సమర్పణ
Watch: ఆసుపత్రిలో నిద్రిస్తున్న మహిళను వేధించిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: వైద్య విద్యార్థినిని.. కాలేజీ క్యాంపస్ నుంచి కిడ్నాప్ చేసిన కుటుంబ సభ్యులు, వీడియో వైరల్

