ప్రైవేట్ స్కూళ్లు విద్యార్థుల నుంచి వసూలు చేస్తున్న ఫీజుల వివరాలు బహిర్గతం చేయాలని విద్యాశాఖ ఆదేశాలు జారీచేయడంపై తెలంగాణ రికగ్నైజ్డ్ ప్రైవేట్ సూల్స్ మేనేజ్మెంట్ అసోసియేషన్(ట్రస్మా) అభ్యంతరం తెలిపింది.
ప్రభుత్వం నుంచి ఎటువంటి ఆర్థిక సహాయం పొందకుండా, సొంత ఆర్థిక వనరులతో నిర్వహిస్తున్న ప్రైవేట్ స్కూళ్ల ఫీజు వివరాలు, ఆడిట్ నివేదికలు సమర్పించాలని కోరడం పరిపాలనా భారం మోపడమేనని ఆరోపించింది.