హైదరాబాద్, నమస్తే తెలంగాణ;హైదరాబాద్‌లోని టీ హబ్ పక్కనే విశాలమైన ప్రాంగణంలో ఏర్పాటు చేసిన టీ వర్క్స్ నిర్మాణం అద్భుతంగా ఉందని జీ 20 స్టార్టప్ ప్రతినిధుల బృందం ప్రశంసించింది. జీ 20 సన్నాహక సమావేశాల్లో భాగంగా నగరానికి వచ్చిన బృందం సభ్యులు ఆదివారం టీ వర్క్స్‌ను సందర్శించారు. అక్కడ పలురకాల ఉత్పత్తుల తయారీకి సంబంధించిన యంత్రాలు, పనిముట్లను పరిశీలించారు.