హైదరాబాద్, సెప్టెంబర్ 25 (నమస్తే తెలంగాణ): ఇంజినీరింగ్ ఫస్టియర్ అడ్మిషన్లను అక్టోబర్ 23లోపు పూర్తిచేసుకోవచ్చని అఖిల భారత సాంకేతిక విద్యామండలి స్పష్టంచేసింది. మిగులు సీట్లను ఆయా తేదీల్లోపు భర్తీచేసుకునే అవకాశమిచ్చిం ది. గతంలో జారీచేసిన 2024-25 విద్యాసంవత్సరం అకడమిక్ క్యాలెండర్ను ఏఐసీటీఈ సవరించింది. అక్టోబర్ 23లోపు ఫస్టియర్ క్లాసులను ప్రారంభించాలని వెల్లడించింది. ల్యాట్రల్ ఎంట్రీ ద్వారా బీటెక్ సెకండియర్లో ప్రవేశాల గడువును సైతం అక్టోబర్ 23గానే ఖరారుచేసింది.
హైదరాబాద్, సెప్టెంబర్ 25(నమస్తే తెలంగాణ): గల్ఫ్ దేశాల్లో మెకానికల్, ఎలక్ట్రికల్, బీఎంఎస్ ఆపరేటర్, ఎంఈపీ టెక్నీషియన్, ఎంఈపీ సూపర్వైజర్ పోస్టుల భర్తీకి కరీంనగర్, నిజామాబాద్, వరంగల్ జిల్లాల్లో 27, 28వ తేదీల్లో ప్రత్యేక డ్రైవ్ నిర్వహించనున్నట్టు టామ్కామ్ ప్రకటనలో తెలిపింది. ఐటీఐ, డిప్లొమా, బీటెక్ ఉత్తీర్ణులై, కనీసం 2నుంచి 4 ఏండ్ల అనుభవం, 20-45 ఏండ్ల మధ్య వయస్సు ఉండాలని పేర్కొన్నారు. ఆసక్తిగల గల వారు www. tomcom.telangana. gov.in కి రెజ్యూమ్ పంపాలని కోరారు.