Murder | నందిపేట్, మే 28: ఓ కూతురు కన్నతల్లినే హతమార్చింది. ఈ ఘటన నిజామాబాద్ జిల్లా నందిపేట్ పోలీస్స్టేషన్ పరిధిలోని ఉమ్మెడ గ్రామంలో చోటుచేసుకున్నది. గ్రామానికి చెందిన నాగం నర్సు(52)కు ఇద్దరు కూతుళ్లు. భర్త మరణించాడు. పెద్ద కూతురు హరితకు ఇంకా పెండ్లి కాలేదు. చిన్న కూతురు అరుణకు పెండ్లి చేసి అత్తారింటికి పంపించింది.
నర్సు, హరిత ఇద్దరు ఒకే ఇంట్లో వేర్వేరు గదుల్లో ఉంటున్నారు. ఇద్దరి మధ్య కొన్ని రోజులుగా గొడవలు జరుగుతున్నాయి. ఈనెల 26న తల్లీకూతురు మరోసారి గొడవపడ్డారు. క్షణికావేశంలో హరిత రోకలిబండతో తల్లి ముఖం, తలపై కొట్టింది. అనంతరం తన గదిలోకి వెళ్లిపోయింది. శనివారం ఉదయం చూసే సరికి తీవ్ర రక్తస్రావమై తల్లి విగతజీవిగా పడి ఉన్నది. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.