సిరిసిల్ల టౌన్, జనవరి 8: ‘మరమగ్గాలపై సిరిసిల్ల నేతన్నలు రూపొందిస్తున్న వస్ర్తాలు అద్భుతంగా ఉన్నాయి. ఇక్కడి కార్మికుల కళా నైపుణ్యం అమోఘం. మంత్రి కేటీఆర్ అందిస్తున్న ప్రోత్సాహం అభినందనీయం’ అని తెలంగాణ బ్రాండ్ అంబాసిడర్, ఎన్ఆర్ఐ సునీతావిజయ్ ప్రశంసలు కురిపించారు. న్యూజిలాండ్‌లో ఉం టున్న ఆమె ఆదివారం టీపీటీడీసీ చైర్మన్ జీ ప్రవీణ్, సిరిసిల్ల మున్సిపల్ చైర్పర్సన్ జిందం కళతో కలిసి సిరిసిల్లలోని అప్పారెల్, టెక్స్టైల్ పార్కు,చంద్రంపేటలోని హరిప్రసాద్ మర మగ్గాల పరిశ్రమను సందర్శించారు. ‘రాజన్న సిరిపట్టు’ చీరెలకు దేశ, విదేశాల్లో ఆదరణ లభిస్తున్నదని చెప్పారు. అగ్గిపెట్టెలో ఇమిడే చీర, జీ-20లోగోతో కూడిన చీరెలు ఆకర్షణీయంగా ఉన్నాయని తెలిపారు.