హైదరాబాద్, ఆగస్టు15 (నమస్తే తెలంగాణ): రైతులను మోసగించిన సీఎం రేవంత్‌రెడ్డి వారికి క్షమాపణ చెప్పాలని బీఆర్ఎస్ ఎన్నారై విభాగం వ్యవస్థాపక అధ్యక్షుడు అనిల్ కూర్మాచలం డిమాండ్ చేశారు. మాజీ మంత్రి హరీశ్‌రావును రాజీనామా చేయాలంటూ సీఎం రేవంత్‌రెడ్డి చిల్లర విమర్శలు చేశారని పేర్కొన్నారు.
ఎన్నికల సమయంలో డిసెంబర్ 9 నాడే రుణమాఫీ చేస్తానని మాటిచ్చి, ఆ తర్వాత 100 రోజుల్లోగా అంటూ హామీ ఇచ్చి, మళ్లీ ఆగసస్టు15 వరకు చేస్తామని రేవంత్‌రెడ్డి రైతులను మోసం చేశారని విమర్శించారు. రాజీనామా హరీశ్‌రావుకు కొత్త కాదని, రైతులకిచ్చిన మాట ప్రకారం రుణమాఫీ చేసి సవాల్‌ను స్వీకరించాలని, గారడీ చేసి తప్పుదోవ పట్టిస్తామనుకుంటే రాబోయే రోజుల్లో ప్రజలే తగిన బుద్ధి చెప్తారని హెచ్చరించారు.
మరిన్ని చిన్న వార్తలు
‘ఎయిర్ టికెట్’కు రూ. 1.6 కోట్ల బురిడీ
హైదరాబాద్ సిటీబ్యూరో, ఆగస్టు 15 (నమస్తే తెలంగాణ): నకిలీ క్రెడిట్ కార్డులతో ఎయిర్ టికెట్ సంస్థను దుండగులు రూ. 1.6 కోట్లకు బురిడీ కొట్టించిన ఘటన గురువారం చోటుచేసుకుంది. బంజారాహిల్స్‌లోని ఇండియన్ ఈగల్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ ఎయిర్ టికెట్ల విక్రయంలో వినియోగదారులకు ఆన్లైన్ సలహాలు, సూచనలిస్తుంది. టికెట్లు విక్రయించిన ఎగ్టిక్యూటివ్లకు కమిషన్ ఇస్తుంది.
ఈ సంస్థకు చెందిన నితీశ్‌తో దుండగులు చాట్ చేసి వ్యక్తిగత ఫోన్ నంబర్ తీసుకుని ఆయన ద్వారా టికెట్లు కొంటామని చెప్పారు. క్రెడిట్ కార్డులు ఉపయోగించి అభిషేక్, పర్వీజ్ అహ్మద్‌నూర్, మహ్మద్హోర, గుండు రాణి తదితరుల పేర్లతో 118 టికెట్లు బుక్ చేశారు. ఇందుకు కమిషన్ రూ.82,500 నితీశ్ ఖాతాలో డిపాజిట్ అయింది. ఈ కార్డులు చోరీ చేసినవని యాజమాన్యం గుర్తించింది. వీటితో బుక్ చేసిన టికెట్లతో సంస్థకు రూ. 1,59,18,900 నష్టం జరిగిందంటూ సంస్థ డైరెక్టర్ రమేశ్ సీసీఎస్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు దర్యాప్తు చేపట్టారు.