కాచిగూడ, నవంబర్ 7: తెలంగాణ ప్రభుత్వం 1.30 లక్షల ఉద్యోగాలు భర్తీచేసిందని, అలాగే దేశంలో ఖాళీగా ఉన్న 16 లక్షల ఉద్యోగాలను కేంద్రం వెంటనే నింపాలని కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల ఓబీసీ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వీ దానకర్ణాచారి డిమాండ్ చేశారు. కేంద్రం ప్రతి సంవత్సరం ఇస్తామన్న రెండు కోట్ల ఉద్యోగ నియామకాలు చేపట్టి 27 శాతం ఓబీసీ రిజర్వేషన్లను అమలుచేయాలని కోరారు. ఆదివారం కాచిగూడలో నిర్వహించిన తెలంగాణ ఓబీసీ ఎంప్లాయిస్ ఫెడరేషన్ సమావేశంలో దానకర్ణచారి మాట్లాడుతూ.. కేంద్రం ఓబీసీలపై ఉన్న క్రీమీలేయర్ విధానాన్ని పూర్తిగా రద్దుచేయాలని, ఓబీసీ ఉద్యోగులకు పదోన్నతుల్లో రిజర్వేషన్లు అమలుపరచాలని డిమాండ్ చేశారు. సమావేశంలో నాయకులు యూ చిన్నయ్య, బీ విటోభా, టీ పద్మ, శ్రీనివాస్‌గౌడ్, జయప్రకాశ్, రవికుమార్, గణేశ్, సురేందర్, కిరణ్‌కుమార్, మధు, మల్లేశ్, ప్రదీప్‌కుమార్, నగేశ్, భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.