హైదరాబాద్ సిటీబ్యూరో, ఫిబ్రవరి 19 (నమస్తే తెలంగాణ): రొమ్ము క్యాన్సర్ నిర్ధారణకు సెంటర్ ఫర్ సెల్యులర్ అండ్ మాలిక్యూలర్ బయాలజీ (సీసీఎంబీ) నూతన విధానాన్ని అభివృద్ధి చేసింది. సీసీఎంబీ పరిశోధకులు చిప్ ఆధారిత డయాగ్నోసిస్ విధానాన్ని డెవలప్ చేస్తున్నారు. దీనివలన వ్యాధి నిర్ధారణ వేగవంతమవుతుందని పేర్కొన్నారు.
డయాబెటిస్ టెస్ట్ తరహాలోనే చేతి నుంచి రక్తం చుక్కలను సేకరించి వాటిని ప్రత్యేక విధానంలో పరీక్షిస్తారు. దీంతో వ్యాధి నిర్ధారణ వేగంగా, తక్కువ ఖర్చులో జరుగుతుందని ప్రాథమిక దశలోనే వ్యాధిని గుర్తించి అందుకు అవసరమైన చికిత్సను పొందేందుకు వీలు ఉంటుందని తెలిపారు.