హైదరాబాద్, మే 6 (నమస్తే తెలంగాణ) : జొన్నల కొనుగోలుకు క్యాబినెట్ సబ్ కమిటీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ మేరకు సోమవారం నిర్వహించిన క్యాబినెట్ భేటీలో జొన్నల కొనుగోలుకు సంబంధించి మంత్రులు భట్టి విక్రమార్క, తుమ్మల నాగేశ్వర్రావు, ఉత్తమ్ కుమార్ రెడ్డిలతో ప్రభుత్వం క్యాబినెట్ సబ్ కమిటీ ఏర్పాటుచేసింది. ఈ కమిటీ మంగళవారం భేటీ అయి ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్టు వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల ప్రకటించారు.
ఇప్పటికే మక్కజొన్న కొనుగోలు చేస్తున్నట్టు తెలిపారు. కేంద్రం నుంచి ఎలాంటి సహాయ సహకారాలు అందకపోయినా, రాష్ట్ర ప్రభుత్వ నిధులతో కొనుగోలు చేస్తున్నట్టు మంత్రి తుమ్మల వెల్లడించారు.