అమెరికాలో నల్లగొండ యువకుడి దారుణ హత్య
- రివాల్వర్‌తో కాల్చి చంపిన నల్లజాతీయులు
నీలగిరి, జూన్ 22: అమెరికాలోని మేరీల్యాండ్‌లో నల్లగొండ పట్టణానికి చెందిన ఓ యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. జిల్లా కేంద్రానికి చెందిన నక్కా నర్సింహ, పద్మ దంపతుల కొడుకు సాయిచరణ్ (25) ఎంఎస్ చదువుకోసం 2020 ఆగస్టులో అమెరికా వెళ్లాడు. చదువు పూర్తికాగానే మేరీల్యాండ్ రాష్ట్రంలోని బాల్టిమోర్ సిటీలో ఉంటూ సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తున్నాడు.
భారత కాలమానం ప్రకారం ఆదివారం ఉదయం 4 గంటలకు తన స్నేహితులను విమానాశ్రయంలో దింపి కారులో ఇంటికి వస్తుండగా నల్లజాతీయులు అటకాయించే ప్రయత్నం చేశారు. అతడు ప్రతిఘటించడంతో దుండగులు రివాల్వర్‌తో కాల్పులు జరిపారు. సాయిచరణ్ తలలోకి బుల్లెట్ దూసుకెళ్లి అక్కడికక్కడే మృతిచెందాడు. ఓ చానల్లో వచ్చిన ఈ వార్తను చూసి అక్కడే స్థిరపడిన సాయిచరణ్ అక్క హారిక వివరాలు తెలుసుకొంది. మృతిచెందింది తన తమ్ముడేనని నిర్దారించుకొంది.
తన బాబాయ్ అమర్నాథ్కు విషయం తెలియజేయగా అతడు సాయిచరణ్ తల్లిదండ్రులకు చెప్పాడు. కొడుకు మృతి విషయం తెలుసుకొన్న తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు. నవంబర్‌లో ఇంటికి రావాలనుకొన్న సాయిచరణ్ శుక్రవారం తనకు ఫోన్‌చేసి మాట్లాడినట్టు నర్సింహ గుర్తుచేసుకొని విలపించారు. విషయం తెలుసుకొన్న ఎమ్మెల్యే భూపాల్‌రెడ్డి సాయిచరణ్ ఇంటికి వెళ్లి అతడి తల్లిదండ్రులను ఓదార్చారు. మంత్రి కేటీఆర్‌తో మాట్లాడి మృతదేహాన్ని త్వరగా తీసుకొచ్చేందుకు కృషిచేస్తానని హామీ ఇచ్చారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Exercise | పీసీఓఎస్ వంటి సమస్యలు ఉన్న మహిళలు చేయాల్సిన వ్యాయామాలు ఇవే..
Boyfriend Falls From Balcony | నాలుగో అంతస్తు నుంచి కిందపడి వ్యక్తి మృతి.. ఇన్ఫ్లుయెన్సర్ అయిన ప్రియురాలిపై అతడి తల్లి ఫిర్యాదు
Vaccine | శీతాకాలంలో వీరికి శ్వాసకోశ సమస్యల ముప్పు ఎక్కువ.. టీకా తీసుకోవాలంటున్న వైద్యులు..
Nuclear War | మానవాళికి ఏఐ, న్యూక్లియర్ ముప్పు.. 2100లోపు మానవాళి అంతం తప్పదా
New Districts | కొత్త జిల్లాల ఏర్పాటు చారిత్రాత్మక ఘట్టం.. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

