హైదరాబాద్, జూన్17 (నమస్తే తెలంగాణ): కేంద్రంలో బీసీ మంత్రిత్వశాఖను ఏర్పాటు చేయడంతోపాటు క్రీమిలేయర్ నిబంధనను తొలగించాలని, ఎంబీసీలు, సంచార జాతుల కోసం జాతీయ గృహనిర్మాణ కార్యక్రమం చేపట్టాలని బీసీ డిక్లరేషన్ ప్రోగ్రాం కమిటీ డిమాండ్ చేసింది. బీసీ కమిషన్ రాష్ట్ర చైర్మన్ డాక్టర్ వకుళాభరణం కృష్ణమోహన్‌రావుతో శనివారం భేటీ అయిన కమిటీ ఇటీవలి సమావేశంలో చేసిన బీసీ డిక్లరేషన్ అంశాలను ఆయన దృష్టికి తీసుకెళ్లింది. వీటిని కేంద్రం దృష్టికి తీసుకెళ్లాలని విజ్ఞప్తి చేసింది.సమావేశంలో కమిటీ చైర్మన్ ప్రొఫెసర్ మురళీ మనోహర్, కన్వీనర్ దేవల్ల సమ్మయ్య, జాతీయ బీసీదళ్ అధ్యక్షుడు దుండ్ర కుమారస్వామి, ప్రొఫెసర్ నరేంద్రబా బు, సాళ్వాచారి తదితరులు పాల్గొన్నారు.
దేశవ్యాప్తంగా 80 కులాలను ఓబీసీ జాబితాలో చేర్చాలన్న కేంద్ర నిర్ణయంపై బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్‌గౌడ్ మండిపడ్డారు. రాష్ట్ర జాబితాలో ఉండి కేంద్ర జాబితాలో లేని కులాలను కలిపితే ఎవరికీ అభ్యంతరం లేదని కానీ, అర్హత లేని కులాలను ఓబీసీ జాబితాలో కలిపితే సహించేది లేదన్నారు.
అప్పీల్ చేశాక కోర్టు ధిక్కరణ శిక్ష చెల్లదు