కొమురవెల్లి, జూలై 17: భూతగాదాలతో ప్రత్యర్థిపై చేసిన దాడి సిద్దిపేట జిల్లా కొమురవెల్లిలో ఫ్యాక్షన్ సినిమాను తలపించింది. స్థానికుల వివరాల ప్రకారం.. కొమురవెల్లి మండలం ఐనాపూర్‌కు చెందిన ఆలేటి రాంరెడ్డి, అదే గ్రామానికి చెందిన నాయిని ప్రతాప్‌రెడ్డి మధ్య కొంతకాలంగా భూతగాదాలు ఉన్నాయి.
గురువారం రాంరెడ్డి కొమురవెల్లిలో వైన్స్ పక్కనే ఉన్న పర్మిట్‌రూమ్‌లో మద్యం తాగుతుండగా ప్రతాప్‌రెడ్డి తన అనుచరవర్గంతో దాడిచేశాడు. దీంతో రాంరెడ్డి భయంతో పక్కనే ఉన్న కొమురవెల్లి పోలీస్‌స్టేషన్‌కు బైక్‌పై వెళ్తుండగా, ప్రత్యర్థులు కారుతో వెంబడించి ఢీకొట్టారు. దీంతో రాంరెడ్డికి తీవ్రగాయాలయ్యాయి. దాడిచేసిన వర్గంపై కేసు నమోదు చేసినట్టు కొమురవెల్లి ఎస్సై రాజు తెలిపారు.