హైదరాబాద్ సిటీబ్యూరో, ఫిబ్రవరి 21 (నమస్తే తెలంగాణ): గీతం డీమ్డ్ యూనివర్సిటీలో 2016-20 బ్యాచ్‌లో బీటెక్ చదివిన శివాలి జోహ్రి శ్రీవాస్తవ 14వ సారి గిన్నిస్ రికార్డు సాధించారు. హ్యాండ్‌మేడ్ పేపర్‌తో రూపొందించిన 2,342 బొమ్మలను తన తల్లిదండ్రులు కవిత, అనిల్ శ్రీవాస్తవతో కలిసి ఆమె ఒకేచోట ప్రదర్శించి అతిపెద్ద ప్రదర్శనగా రికార్డు నెలకొల్పింది. గతంలో కూడా హ్యాండ్‌మేడ్ పేపర్‌తో రూపొందించిన 1,251 విభిన్న రకాల బొమ్మలను ప్రదర్శించి వీరు గిన్నిస్ రికార్డు సాధించారు. ఇలా 13 రికార్డులను సాధించిన శివాలి కుటుంబం.. మరోసారి గిన్నిస్ రికార్డు సాధించడంపై పట్ల వర్సిటీ వీసీ ప్రొఫెసర్ ఎన్ శివప్రసాద్, రెసిడెంట్ డైరెక్టర్ డీవీవీఎస్ఆర్ వర్మ తదితరులు అభినందనలు తెలిపారు.