హైదరాబాద్, ఫిబ్రవరి 9 (నమస్తే తెలంగాణ): మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్యకేసు నిందితులు శుక్రవారం ఉదయం 10.30 గంటలకు హైదరాబాద్ సీబీఐ కోర్టులో హాజరు పర్చనున్నారు. గురువారం రాత్రి కడప జైలు నుంచి రిమాండ్ ఖైదీలు ఏ2 సునీల్‌కుమార్, ఏ3 ఉమాశంకర్‌రెడ్డి, ఏ5 దేవిరెడ్డి శంకర్‌రెడ్డిని భారీ బందోబస్తు మధ్య హైదరాబాద్‌కు తరలించారు. ఒక్కొక్కరికి ఎస్సై స్థాయి అధికారితో పాటు ముగ్గురు కానిస్టేబుళ్ల చొప్పున మొత్తం 12 మంది భద్రత మధ్య హైదరాబాద్‌కు తీసుకొచ్చారు. ఈ కేసులో ఏ-5గా ఉన్న ఎంపీ అవినాశ్‌రెడ్డి అనుచరుడు, వైసీసీ రాష్ట్ర కార్యదర్శి దేవిరెడ్డి శంకర్‌రెడ్డి పోలీసు వాహనంలో కాకుండా సొంత వాహనంలో వెళ్తానని పట్టుబట్టారు. అతన్ని తాడేపల్లి లేదా పులివెందుల నుంచి ప్రత్యేక వాహనం ద్వారా హైదరాబాద్‌కు తరలించే అవకాశాలున్నట్టు ప్రచారం.