హైదరాబాద్, మార్చి 30 (నమస్తే తెలంగాణ) : సెంట్రల్ యూనివర్సిటీ భూములను కబ్జా చేయడాన్ని అఖిల భారతీయ విద్యార్థి పరిషత్(ఏబీవీపీ) తీవ్రంగా ఖండించింది. సెంట్రల్ వర్సిటీ స్థలంలోకి జేసీబీలను తీసుకువస్తుండగా అడ్డుకున్న ఏబీవీపీ జాతీయ కార్యదర్శి శ్రావణ్, బీ రాజ్‌ను పోలీసులు అరెస్టు చేశారు.
తమ ప్రయోజనాల కోసం వర్సిటీలను యుద్ధభూములుగా మార్చొద్దని ప్రభుత్వానికి ఏబీవీపీ సూచించింది.