హైదరాబాద్, జనవరి 27 (నమస్తే తెలంగాణ): ఏబీవీపీ రాష్ట్ర కార్యదర్శి ఝాన్సీపై దాడి చేసిన మహిళా కానిస్టేబుల్ పైన చర్య తీసుకోవాలని గవర్నర్ తమిళిసై సౌందర్రాజన్కు ఏబీవీపీ రాష్ట్ర శాఖ విజ్ఞప్తి చేసింది. శనివారం రాజ్భవన్లో గవర్నర్కు వినతిపత్రం అందజేసింది. జీవో 55ను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ శాంతియుతంగా నిరసన తెలుపుతున్న ఏబీవీపీ రాష్ట్ర కార్యదర్శి చింతకాయల ఝాన్సీ, ఇతర విద్యార్థి నాయకులపై పోలీసులు అమానవీయంగా ప్రవర్తించారని ఏబీవీపీ నాయకులు ఆరోపించారు.
ఝాన్సీని లేడీ కానిస్టేబుళ్లు సూటీపై వెంబడించి జుట్టిపట్టి లాగి కిందపడేశారని తెలిపారు. ఆ ఘటనపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని గవర్నర్ను కోరారు. గవర్నర్ను కలిసినవారిలో బాధితురాలితోపాటు ఏబీవీపీ స్టేట్ జాయింట్ సెక్రటరీలు శ్రీనాథ్, పృథ్వీరాజ్, కల్యాణి తదితరులున్నారు.