హైదరాబాద్, జూన్ 22 (నమస్తే తెలంగాణ) : 20వ భారత గౌరవ రైలు శనివారం సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి ‘దివ్య దక్షిణ యాత్ర’ పేరుతో బయలుదేరింది.
తిరువన్నమలై (అరుణాచలం), రామేశ్వరం, మధురై, కన్యాకుమారి, త్రివేండ్రం, త్రిచితో పాటు తంజావూర్ వరకు 592 ప్రయాణికులతో ఎనిమిది రాత్రులు, తొమ్మిది పగళ్లుగా యాత్ర కొనసాగుతుందని అధికారులు తెలిపారు.