ఆదిలాబాద్ : అటవీ విస్తీర్ణం పెరుగుదలలో రాష్ట్రానికి రెండో స్థానం, మెగా సిటీ అటవీ విస్తీర్ణంలో హైదరాబాద్ నగరానికి మొదటి స్థానం దక్కడం అది సీఎం కేసీఆర్‌కు దక్కిన గౌరవం అని
అటవీ, పర్యావరణ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి అన్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..కేసీఆర్ మానస పుత్రిక హరితహారం అన్నారు. ఏడేళ్లలో రాష్ట్ర వ్యాప్తంగా 230 కోట్ల మొక్కలు నాటామని వివరాలను వెల్లడించారు. మొక్కల పెరుగుదల అటవీ విస్తీర్ణం ఎదుగుదలకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని స్పష్టం చేశారు.
హరితహారం నిరంతరంగా కొనసాగుతుంది.
రాష్ట్రంలో 28 శాతం పచ్చదనం నెలకొందన్నారు. 2025 నాటికి 42 శాతం గ్రీనరీ సాధించేలా చర్యలు తీసుకుంటున్నామని మంత్రి వివరించారు. పచ్చదనం పెంపొందించడంలో భాగంగా పల్లె ప్రకృతి వనాల నుంచి హెచ్ఎండీఏ వరకు పార్కులను ఏర్పాటు చేస్తున్నాం.
మొక్కల పెంపకంలో ప్రజలు, అధికారులు, ప్రజా ప్రతినిధులు భాగస్వాములు అవుతున్నారని మంత్రి తెలిపారు. అడవుల సంరక్షణ పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నాం. స్మగ్లర్లపై పీడీ యాక్ట్ నమోదు చేస్తున్నామని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి స్పష్టం చేశారు.