హైదరాబాద్, ఆగస్టు 26 (నమస్తే తెలంగాణ): అంగన్వాడీ టీచర్లు, హెల్పర్ల ఉద్యోగ విరమణ వయస్సును ప్రభుత్వం 65 ఏండ్లకు పెంచడం పట్ల ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత హర్షం వ్యక్తంచేశారు. అంగన్వాడీల సంక్షేమానికి కేసీఆర్ ప్రభుత్వం పెద్దపీట వేస్తున్నదన డానికి ఇదే నిదర్శనమని పేర్కొన్నారు. శనివారం హైదరాబాద్లో మినీ అంగన్వాడీ టీచర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షురాలు ఆడె పు వరలక్ష్మి, యూనియన్ ప్రతినిధులు ఎమ్మె ల్సీ కవితను కలిశారు. తమ విజ్ఞప్తులు పరిష్కరించడానికి కృషిచేసిన కవితకు, వెంటనే పరిషరించిన సీఎం కేసీఆర్కు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ కవిత మాట్లాడుతూ.. దేశంలో ఎకడా లేనివిధంగా సీఎం కేసీఆర్ చరిత్రాత్మక నిర్ణయం తీసుకున్నారని తెలిపారు. ఉద్యోగ విరమణ వయసు 65 ఏండ్లకు పెంచడమే కాకుండా ఉద్యోగ విరమణ సమయంలో అంగన్వాడీ టీచర్లకు రూ.లక్ష, హెల్పర్లకు రూ.50వేలు అందించాలని నిర్ణయించడం శుభపరిణామని అన్నారు. ఉద్యోగ విరమణ తర్వాత ఆసరా పెన్షన్ కూ డా మంజూరు చేయాలని కేసీఆర్ తీసుకున్న నిర్ణయం అంగన్వాడీల భవిష్యత్తుకు భరోసా ఇస్తుందని చెప్పారు. అనేక రాష్ట్రాల్లో అంగన్వాడీలకు అరకొర వేతనాలు చెల్లిస్తుంటే, తెలంగాణలో సీఎం 3సార్లు వేతనాలు పెంచారని గుర్తు చేశారు.
ఎమ్మెల్సీ కవితకు మత్స్యశాఖ కాంట్రాక్టు ఉద్యోగుల వినతి
ఆరేండ్లుగా మత్స్యశాఖలో పనిచేస్తూ ప్రభు త్వం అమలుచేస్తున్న పలు పథకాలు విజయవంతమయ్యేలా క్షేత్రస్థాయిలో కృషి చేస్తున్న తమ ఉద్యోగాలను క్రమబద్ధీకరించాలని మ త్స్యశాఖ కాంట్రాక్టు ఉద్యోగులు ఎమ్మెల్సీ కవితను కోరారు. ఈ విషయమై సంఘం నేతలు శనివారం ఎమ్మెల్సీకి వినతిపత్రం అందజేశా రు. పర్మినెంట్ చేయడానికి అర్హతలు ఉన్నాయన్న విషయం ఇప్పటికే సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లామని, ఇందుకు సంబంధించి ప్రక్రియ నడుస్తున్నదని, కొద్ది రోజుల్లోనే నిర్ణయం వెలువడే అవకాశం ఉందని ఎమ్మెల్సీ చెప్పారని అసోసియేషన్ అధ్యక్షుడు రమేశ్ తెలిపారు.