హైదరాబాద్, ఆగస్టు 25 (నమస్తే తెలంగాణ) : నిజామాబాద్ డిపోకు చెందిన ఆర్టీసీ డ్రైవర్ను ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు. వివరాల్లోకి వెళ్తే.. నిజామాబాద్ జిల్లా కేంద్రంలో ఈ నెల 19న కురిసిన భారీ వర్షానికి రైల్వే అండర్ బ్రిడ్జి వద్ద భారీగా నీరు నిలిచింది. ఆ సమయంలో ఆర్టీసీ డ్రైవర్ సాంబయ్య నీళ్లలోనే బస్సు తీసుకెళ్లడంతో సగం వరకు నీటిలో మునిగింది.
ఈత వచ్చినవాళ్లు బస్సులోంచి దూకి బయటకు రాగా, మహిళలు, పిల్లలు బస్సులో చికుకుపోయారు. స్థానికులు స్పందించి మహిళలు, చిన్నారులను సురక్షితంగా బయటకుచేర్చారు. దీనిపై విచారణ జరిపిన ఆర్టీసీ ఉన్నతాధికారులు డ్రైవర్ను సస్పెండ్ చేశారు. మున్సిపల్, రైల్వే అధికారుల తప్పిదాలకు డ్రైవర్ను అన్యాయంగా బలిచేశారని విమర్శలు వెలువెత్తుతున్నాయి.