TGSRTC | ఆధార్ కార్డులో తెలంగాణ లేదని.. ఫ్రీ టికెట్ ఇచ్చేందుకు కండక్టర్ నిరాకరణ
TGSRTC | తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగులు ప్రయాణికుల పట్ల అసహనం ప్రదర్శిస్తున్నారు. ఆధార్ కార్డులో తెలంగాణ రాష్ట్రం అని లేకపోతే మహిళా ప్రయాణికులకు ఫ్రీ టికెట్లు ఇచ్చేందుకు నిరాకరిస్తున్నారు. అంతేకాదు.. ఆధార్ కార్డు అప్డేట్ లేకపోయినా ఇష్టమొచ్చినట్లు దుర్భషలాడుతున్నారు. డబ్బులిచ్చి టికెట్ తీసుకోవాలని బెదిరింపులకు గురి చేస్తున్నారు.
TGSRTC | హైదరాబాద్ : తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగులు ప్రయాణికుల పట్ల అసహనం ప్రదర్శిస్తున్నారు. ఆధార్ కార్డులో తెలంగాణ రాష్ట్రం అని లేకపోతే మహిళా ప్రయాణికులకు ఫ్రీ టికెట్లు ఇచ్చేందుకు నిరాకరిస్తున్నారు. అంతేకాదు.. ఆధార్ కార్డు అప్డేట్ లేకపోయినా ఇష్టమొచ్చినట్లు దుర్భషలాడుతున్నారు. డబ్బులిచ్చి టికెట్ తీసుకోవాలని బెదిరింపులకు గురి చేస్తున్నారు. ఇలాంటి ఘటనలు ఆర్టీసీ బస్సుల్లో నిత్యకృత్యమయ్యాయి.
తాజాగా హైదరాబాద్ నగరంలో కూకట్పల్లి-4 ఫేజ్లో ఓ మహిళా ప్రయాణికురాలు AP 11 Z 6960 అనే ఆర్టీసీ బస్సు ఎక్కింది. ఆధార్ కార్డు చూపించి ఫ్రీ టికెట్ ఇవ్వాలని కండక్టర్ను అడిగింది ఆమె. అయితే ఆధార్ కార్డులో అడ్రస్ మందమర్రి, ఆదిలాబాద్ జిల్లా, రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అని ఉంది. రాష్ట్రం స్థానంలో తెలంగాణ ఉండాలని కండక్టర్ చెప్పాడు. ఆంధ్రప్రదేశ్ ఉన్నందున ఫ్రీ టికెట్ ఇవ్వనని కండక్టర్ సదరు ప్రయాణికురాలికి తేల్చిచెప్పాడు. నేను తెలంగాణకు చెందిన మహిళను అని వాదించినప్పటికీ, డబ్బులిచ్చి టికెట్ కొనాల్సిందేనని లేదంటే బస్సు దిగి వెళ్లిపోవాలని వారించాడు. దీంతో చేసేదేమీ లేక ప్రయాణికురాలు రూ. 30 చెల్లించి టికెట్ తీసుకుంది.
కండక్టర్ తీరుపై సదరు ప్రయాణికురాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని ఆమె ఆర్టీసీ ఉన్నతాధికారులకు విన్నవించింది. ఈ ఘటనకు సంబంధించిన ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి.
ఆధార్ కార్డులో తెలంగాణ అని లేదని ఫ్రీ టికెట్ ఇచ్చేది లేదంటూ మహిళను తిట్టిన కండక్టర్
ఈరోజు మధ్యాహ్నం 2 గంటల ప్రాంతంలో కూకట్పల్లి 4 ఫేజ్లో ఓ మహిళ AP11Z6960 బస్ ఎక్కి ఆధార్ కార్డు చూపించింది. అందులో అడ్రస్ మందమర్రి, అదిలాబాద్ జిల్లా ఆంధ్ర ప్రదేశ్ అని ఉండగా తెలంగాణ అని లేదని ఫ్రీ… pic.twitter.com/NLa3tWvRhb
— Telugu Scribe (@TeluguScribe) July 14, 2024
ఇవి కూడా చదవండి..
Seetakka | మీరు ఎంత గగ్గోలు పెట్టినా పరీక్షలు వాయిదా వేయం : మంత్రి సీతక్క
Heavy Rain | తెలంగాణలో ఐదురోజులు అతిభారీ వర్షాలు..! ఆరెంజ్ అలెర్ట్ జారీ చేసిన ఐఎండీ..
BRS Party | కాగజ్నగర్ ఉక్కు మహిళలకు పాదాభివందనాలు : ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
Harish Rao | చేసిన పనులే చరిత్రలో నిలిపోతాయి : హరీశ్ రావు
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

