హైదరాబాద్, నవంబర్ 12 (నమస్తే తెలంగాణ) : తెలంగాణ సెక్రటేరియట్ ఆఫీసర్స్ అసోసియేషన్ (టీజీఎస్వోఏ) ఎన్నికలకు మంగళవారం నోటిఫికేషన్ విడుదలైంది. ఈనెల 18న ఎన్నికలు నిర్వహించనున్నట్టు ఎన్నికల అధికారి ఎన్ శంకర్ తెలిపారు. నేటి (బుధవారం) నుంచి నామినేషన్లు తీసుకోనున్నట్టు వెల్లడించారు.
హైదరాబాద్, నవంబర్ 12 (నమస్తే తెలంగాణ) : సివిల్స్ ఆశావహులకు ఢిల్లీ తరహా కోచింగ్ ఇవ్వటమే లక్ష్యంగా హైదరాబాద్‌లో శ్రీరామ్స్ ఐఏఎస్ కోచింగ్ సెంటర్ బ్రాంచీని ప్రారంభించింది. ఢిల్లీ, పూణేల్లో సేవలందించిన సంస్థ.. ఆర్టీసీ క్రాస్‌రోడ్స్‌లో మరో శాఖను ప్రారంభించినట్టు అసోసియేట్ శ్రీరంగం శ్రీశ్రీ తెలిపారు. తమ కోచింగ్ సెంటర్లో యూపీఎస్సీ ఫౌండేషన్ కోర్సు, మెంటార్షిప్, టెస్ట్ సిరీస్, టీజీపీఎస్సీ పోటీ పరీక్షలకు శిక్షణ ఇవ్వనున్నట్టు పేర్కొన్నారు.