TGRJC CET | హైదరాబాద్, మే 20 (నమస్తే తెలంగాణ) : తెలంగాణ గురుకుల జూనియర్ కాలేజీలలో ఇంటర్ మొదటి సంవత్సరంలో ప్రవేశాలు కల్పించేందుకు నిర్వహించిన టీజీ ఆర్జేసీ సెట్ ఫలితాలు మంగళవారం విడుదలయ్యాయి. 2025-26 విద్యాసంవత్సరంలో రాష్ట్రoలోని 35 గురుకుల జూనియర్ కళాశాలల్లో ప్రవేశము కొరకు మే 10న రాష్ట్రవ్యాప్తంగా ప్రవేశ పరీక్షను నిర్వహించారు. ఈ పరీక్ష ఫలితాలను tgrjc.cgg.gov.in వెబ్సైట్లో పొందుపరిచినట్టు సంస్థ కార్యదర్శి రమణకుమార్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ వెబ్సైట్ ద్వారా మార్కులు, ర్యాంకులు తెలుసుకోవచ్చన్నారు. మెరిట్, రిజర్వేషన్ ద్వారా సీట్ల కేటాయింపు ఉంటుంది. ప్రవేశాలకు సంబంధించిన వివరాలను ఈ నెల 24న విద్యార్థుల మొబైల్స్‌కు పంపిస్తామన్నారు.