హైదరాబాద్, సెప్టెంబర్ 15 (నమస్తే తెలంగాణ) : విద్యుత్తు సంస్థల అవసరం మేరకు కొత్త పోస్టులు మంజూరుచేయాలని తెలంగాణ పవర్ ఇంజినీర్స్ అసోసియేషన్(టీజీపీఈఏ) డిమాండ్చేసింది. ట్రాన్స్ఫర్ పాలసీని రూపొందించాలని, పదోన్నతులు కల్పించాలని కోరింది.
టీజీపీఈఏ ఆధ్వర్యంలో సోమవారం ఇంజినీర్స్ డేను నిర్వహించారు. ఇంధనశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ నవీన్‌మిట్టల్, విద్యుత్తు సంస్థల సీఎండీలు హరీశ్, ముషారఫ్ ఫారూఖీ హాజరయ్యారు. ఈ సందర్భంగా అసోసియేషన్ అధ్యక్షుడు రత్నాకర్‌రావు, ప్రధాన కార్యదర్శి సదానందం మాట్లాడుతూ.. 1999 -2004 మధ్యలో రిక్రూట్ అయిన వారికి జీపీఎఫ్ సౌకర్యం కల్పించాలని కోరారు.