హైదరాబాద్, ఫిబ్రవరి 15 (నమస్తే తెలంగాణ) : నల్లగొండ, వరంగల్, ఖమ్మం ఉమ్మడి జిల్లాల టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీచేస్తున్న పూల రవీందర్‌కు తెలంగాణ గెజిటెడ్ లెక్చరర్స్ అసోసియేషన్ మద్దతు పలికింది. శనివారం అసోసియేషన్ అధ్యక్షుడు సీహెచ్ కనకచంద్రం పూల రవీందర్‌ను కలిసి తమ మద్దతు లేఖను అందజేశారు.
ఇన్నారెడ్డికి టీజీటీటీఎఫ్ మద్దతు
హైదరాబాద్, ఫిబ్రవరి 15 (నమస్తే తెలంగాణ) : సీపీఎస్ఈయూ పక్షాన కరీంనగర్, మెదక్, ఆదిలాబాద్, నిజామాబాద్ ఉమ్మడి జిల్లాల టీచర్ ఎమ్మెల్సీగా పోటీ చేస్తున్న తిరుమలరెడ్డి ఇన్నారెడ్డికి తెలంగాణ ట్రైబల్ టీచర్స్ ఫెడరేషన్(టీటీఎఫ్) మద్దతు పలికింది. సంఘం రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్‌నాయక్, ప్రధాన కార్యదర్శి గణేశ్‌నాయక్ శనివారం ఇన్నారెడ్డితోపాటు సీఎపీఎస్ఈయూ రాష్ట్ర అధ్యక్షుడు స్థితప్రజ్ఞ, ప్రధాన కార్యదర్శి కల్వల్ శ్రీకాంత్‌ను కలిసి మద్దతు లేఖ అందజేశారు.