హైదరాబాద్, జూన్ 2 (నమస్తే తెలంగాణ): రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన జహీరాబాద్ దవాఖానలో సెల్‌ఫోన్ లైట్ వెలుతురులో చికిత్స అంశానికి సంబంధించి తెలంగాణ ప్రభుత్వ వైద్యుల సంఘం (టీజీజీడీఏ) రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ నరహరి, టీవీవీపీ కమిషనర్ అజయ్‌కుమార్‌తో కలిసి ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహను సోమవారం కలిశారు.
ఈ సందర్భంగా సస్పెండ్ అయిన వైద్యుడి అంశంపై వాస్తవాలను మంత్రికి వివరించినట్టు వారు తెలిపారు. తాము వివరించిన అంశాలపై మంత్రి సానుకూలంగా స్పందించి.. సస్పెన్షన్ ఉపసంహరించుకునేందుకు అంగీకరించినట్టు వెల్లడించారు. ప్రధాన కార్యదర్శి డాక్టర్ లాలుప్రసాద్ రాథోడ్, కోశాధికారి ఎంకే రౌఫ్, సీఈసీ సభ్యుడు డాక్టర్ రాజశేఖర్ పాల్గొన్నారు.