TG TET | ఇక నుంచి ఏడాదికి రెండు సార్లు టెట్ నిర్వహణ.. తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ
TG TET | టీచర్ పోస్టులకు ప్రిపేరయ్యే అభ్యర్థులకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వెసులుబాటు కల్పించింది. ఇక నుంచి ఏడాదికి రెండు సార్లు టెట్(టీచర్ ఎలిజబిలిటీ టెస్ట్) నిర్వహించాలని నిర్ణయించింది. ఈ మేరకు రాష్ట్ర విద్యాశాఖ అధికారికంగా ఉత్తర్వులు జారీ చేసింది.
TG TET | హైదరాబాద్ : టీచర్ పోస్టులకు ప్రిపేరయ్యే అభ్యర్థులకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వెసులుబాటు కల్పించింది. ఇక నుంచి ఏడాదికి రెండు సార్లు టెట్(టీచర్ ఎలిజబిలిటీ టెస్ట్) నిర్వహించాలని నిర్ణయించింది. ఈ మేరకు రాష్ట్ర విద్యాశాఖ అధికారికంగా ఉత్తర్వులు జారీ చేసింది. ప్రతి ఏడాది జూన్ నెలలో ఒకసారి, డిసెంబర్ నెలలో మరోసారి టెట్ నిర్వహించనున్నారు. ఇక ఒక అభ్యర్థి ఎన్నిసార్లైనా టెట్ రాసుకోవచ్చని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. అయితే టెట్‌లో ఉత్తీర్ణత సాధించిన వారికే డీఎస్సీ రాసుకునేందుకు అవకాశం కల్పించనున్నారు. టెట్ మార్కులను డీఎస్సీలో వెయిటేజీ ఇవ్వనున్నారు.
గతంలోనే నేషనల్ కౌన్సిల్ ఫర్ టీచర్ ఎడ్యుకేషన్ (ఎన్సీటీఈ) ఏటా రెండుసార్లు టెట్ నిర్వహించాలని రాష్ట్రాలను ఆదేశించిన సంగతి తెలిసిందే. అంతేకాకుండా టెట్ గడువును జీవితకాలానికి పెంచింది కేంద్ర ప్రభుత్వం. దీంతో ఒక్కసారి క్వాలిఫై అయితే, మరోసారి రాయాల్సిన అవసరం లేదు. టెట్ మార్కులకు డీఎస్సీలో వెయిటేజీ ఉండటంతో కేవలం ఇప్పటికే టెట్ క్వాలిఫై అయిన అభ్యర్థులు తమ స్కోర్ పెంచుకునేందుకు మాత్రమే రాసుకోవచ్చు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

