TG Polycet | హైదరాబాద్ : టీజీ పాలిసెట్ -2025 ఫలితాలు విడుదలయ్యాయి. ఈ ఫలితాలను మాసబ్‌ట్యాంక్‌లోని సాంకేతిక విద్యామండలి కార్యాలయంలో సాంకేతిక విద్యాశాఖ కమిషనర్ ఏ దేవసేన విడుదల చేశారు. డిప్లొమా ఇన్ ఇంజనీరింగ్ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించిన పాలిసెట్ ప్రవేశ పరీక్షలో 84.33 శాతం ఉత్తీర్ణత సాధించారు. ఎంపీసీ విభాగంలో 81.88 శాతం, ఎంబైపీసీలో 84.33 శాతం విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. 106716 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకోగా, 98858 మంది హాజరయ్యారు. వీరిలో 83364 మంది ఉత్తీర్ణత సాధించారు.