TG Number Plate | హైదరాబాద్, ఫిబ్రవరి 5 (నమస్తే తెలంగాణ): వాహనాల రిజిస్ట్రేషన్ కోడ్‌ను తెలంగాణ స్టేట్ (టీఎస్) నుంచి తెలంగాణ గవర్నమెంట్ (టీజీ)గా మార్చాలని రాష్ట్రప్రభుత్వం నిర్ణయించిన నేప థ్యంలో ప్రస్తుతం ఉన్న టీఎస్ నంబర్ ప్లేట్లను మార్చుకోవాల్సిన అవసరం లేదని రవాణాశాఖ అధికారులు చెప్తున్నారు. టీఎస్‌ను టీజీగా మారుస్తున్నట్టు ప్రభుత్వం జీవో విడుదల చేసిన తర్వాతి నుంచి కొత్తగా రిజిస్ట్రేషన్ చేసుకునే వాహనాలకు అది వర్తిస్తుంది. ఈ విషయంలో ఆందోళన అవసరం లేదని, ఒకవేళ అలాంటిదేమైనా ఉంటే అధికారికంగా ప్రకటిస్తామని, అప్పటి వరకు ఎవరూ నంబర్ ప్లేట్లను తమంత తాముగా టీజీగా మార్చుకోవద్దని రవాణాశాఖ అధికారులు కోరారు.