హైదరాబాద్, జూన్ 17 (నమస్తే తెలంగాణ): జూన్ 26న అంతర్జాతీయ డ్రగ్స్ వ్యతిరేక దినోత్సవం సందర్భంగా ‘సమాజంపై మాదకద్రవ్యాల ప్రభావం’ అనే అంశంపై టీజీ న్యాబ్ లఘు చిత్రాల పోటీ నిర్వహిస్తున్నది. రాష్ట్రవ్యాప్తంగా విద్యాసంస్థలు, వివిధ ప్రాంతాల్లో అవగాహన కల్పిస్తామని, ఇందుకు అనుగుణంగా లఘుచిత్రాలు రూపొందించాలని టీజీ న్యాబ్ డైరెక్టర్ సందీప్ శాండిల్య తెలిపారు.
పోటీల్లో ఉత్తమ లఘుచిత్రాలను ఎంపిక చేసి ప్రథమ బహుమతికి రూ.50 వేలు, ద్వితీయ రూ.30 వేలు, తృతీయ రూ.20 వేలు ప్రకటించారు. ఆసక్తి కలిగిన షార్ట్ఫిల్మ్ మేకర్స్ జూన్ 20లోగా తమ లఘు చిత్రాలను నిర్దేశిత విధానంలో పంపాలని, సందేహాలుంటే 8712671111, 8712 661710, 8712661735 నంబర్లలో సంప్రదించాలని టీజీ న్యాబ్ అధికారులు కోరారు.