హైదరాబాద్, సెప్టెంబర్ 19 (నమస్తే తెలంగాణ): టీజీఐసెట్-2024 తుది విడుత కౌన్సెలింగ్ శుక్రవారం నుంచి ప్రారంభం కానున్నది. ఈ మేరకు ఉన్నత విద్యాకమిషనర్, టీజీఐసెట్ అడ్మిషన్ల కన్వీనర్ గురువారం షెడ్యూల్ ప్రకటించారు. ఈ నెల 20, 21 తేదీల్లో రిజిస్ట్రేషన్‌తోపాటు ఆన్లైన్లో సర్టిఫికెట్ వెరిఫికేషన్ పూర్తిచేసుకోవాలని అధికారులు తెలిపారు.
21, 22 తేదీల్లో వెబ్ ఆప్షన్లను ఎంచుకొని, 22వ తేదీన ఫ్రీజింగ్ చేసుకోవాలి. 25వ తేదీలోపు సీట్లను కేటాయిస్తామని, 25, 27 తేదీల్లో నిర్ణీత ఫీజును చెల్లించి 25 నుంచి 28 తేదీల్లో కాలేజీల్లో రిపోర్ట్ చేయాలని పేర్కొన్నారు. 27న స్పాట్ అడ్మిషన్లకు సంబంధించి మార్గదర్శకాలు విడుదలకానున్నాయి. ఇటీవలే ఫస్ట్ ఫేజ్ కౌన్సెలింగ్ ముగియగా, మిగిలిన 4,448 సీట్లకు కౌన్సెలింగ్ నిర్వహించనున్నారు.
బీ ఫార్మసీ ప్రవేశాలకు కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదల
హైదరాబాద్, సెప్టెంబర్ 19 (నమస్తే తెలంగాణ): రాష్ట్రవ్యాప్తంగా ఉన్న కళాశాలల్లో 2024-25 విద్యాసంవత్సరానికి బీ ఫార్మసీ, ఫార్మ డీ కోర్సుల్లో ప్రవేశాల కౌన్సెలింగ్‌కు టీజీఈఏపీ సె ట్-2024 ప్రవేశాల కన్వీనర్, సాంకేతి క విద్యాకమిషనర్ శ్రీదేవసేన గురువా రం షెడ్యూల్‌ను ప్రకటించారు. ఇంజినీరింగ్ కౌన్సెలింగ్‌లో భాగంగా ఇప్పటికే సర్టిఫికెట్ల వెరిఫికేషన్ పూర్తయిన అభ్యర్థులు ఈ నెల 24, 25 తేదీల్లో వెబ్ ఆ ప్షన్లు ఎంచుకోవచ్చు.
27వ తేదీలోపు సీట్ల తాతాలిక కేటాయింపు ఉండగా, 27 నుంచి 28 వరకు ట్యూషన్ ఫీజు చె ల్లింపుతోపాటు వెబ్సైట్ ద్వారా రిపోర్టింగ్ చేయాల్సి ఉంటుంది. 28, 29 తేదీల్లో సీట్లు పొందిన విద్యార్థులు కళాశాలకు వెళ్లి జాయినింగ్ రిపోర్టు ఇవ్వా లి. 30న ఆయా కాలేజీలు విద్యార్థుల జాబితాను ప్రకటిస్తాయి. వివరాలకు https:// tgeap cetb.nic.in ను చూడాలని కన్వీనర్ సూచించారు.