TGPSC | గ్రూప్-1 నియామకాలపై టీజీపీఎస్సీ అప్పీల్.. సింగిల్ బెంచ్ ఉత్తర్వులు రద్దు చేసేందుకు సీజే ధర్మాసనం నో..!
TGPSC | గ్రూప్-1 టీజీపీఎస్సీ దాఖలు చేసిన అప్పీలు పిటిషన్‌పై తెలంగాణ హైకోర్టు బుధవారం విచారణ జరిపింది. సింగిల్ బెంచ్ ఇచ్చిన ఉత్తర్వులను రద్దు చేయాలని టీజీపీఎస్సీ కోరింది. అయితే, సింగిల్ బెంచ్ ఇచ్చిన ఉత్తర్వులను రద్దు చేసేందుకు సీజే ధర్మాసనం నిరాకరించింది.
TGPSC | గ్రూప్-1 టీజీపీఎస్సీ దాఖలు చేసిన అప్పీలు పిటిషన్‌పై తెలంగాణ హైకోర్టు బుధవారం విచారణ జరిపింది. సింగిల్ బెంచ్ ఇచ్చిన ఉత్తర్వులను రద్దు చేయాలని టీజీపీఎస్సీ కోరింది. అయితే, సింగిల్ బెంచ్ ఇచ్చిన ఉత్తర్వులను రద్దు చేసేందుకు సీజే ధర్మాసనం నిరాకరించింది. ఇవాళ సింగిల్ బెంచ్‌లో విచారణ జరుగనున్నందున జోక్యం చేసుకోలేమని ధర్మాసనం స్పష్టం చేసింది. సింగిల్ బెంచ్‌లోనే పిటిషన్లపై తేల్చుకోవాలని ధర్మాసనం తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్‌కు సూచించింది. గ్రూప్-1 మెయిన్స్ మూల్యాంకనంలో అక్రమాలు జరిగాయంటూ పలువురు అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే.
పరీక్షా కేంద్రాల కేటాయింపులోనూ నిబంధనలు పాటించలేదంటూ అభ్యర్థులు ఆరోపించారు. రీకౌంటింగ్‌లో మార్కులు, టీజీపీఎస్సీ జారీ చేసిన మెమో మార్కులకు తేడాలున్నాయని పిటిషన్లు హైకోర్టు దృష్టికి తీసుకువచ్చారు. ఈ పిటిషన్లను విచారించిన సింగిల్ బెంచ్ ధర్మాసనం ఈ నెల 17న మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. గ్రూప్-1 నియామకపత్రాలను ఇవ్వొద్దని జస్టిస్ నామవరపు రాజేశ్వరరావు టీజీపీఎస్సీని ఆదేశించారు. సర్టిఫికెట్ల వెరిఫికేషన్ పూర్తి చేయొచ్చని చెప్పారు. అయితే, సింగిల్ బెంచ్ ఉత్తర్వులు రద్దు చేయాలంటూ హైకోర్టులో టీజీపీఎస్పీ అప్పీల్ చేసింది. కేసు ప్రస్తుతం విచారణలో ఉన్నందున జోక్యం చేసుకునేందుకు సీజే ధర్మాసనం నిరాకరించింది. టీజీపీఎస్సీ దాఖలు చేసిన అప్పీల్‌పై విచారణను ముగించింది. మరో వైపు బుధవారం సింగిల్ బెంచ్‌లో గ్రూప్-1 పిటిషన్లపై విచారణ జరుగనున్నది.
పదవ తరగతి పరీక్ష పలితాలు 2025
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Ramayana | ‘రామాయణ’ కంటే ‘ఆదిపురుష్’ విజువల్స్ బెటరా.. గ్రాఫిక్స్ విషయంలో ప్రభాస్ సినిమాకే ఎక్కువ మార్కులు!
MLA Murali Naik | దీపావళి వేడుకల్లో ఎమ్మెల్యే మురళీ నాయక్ చేదు అనుభవం : వీడియో
Virosh | జపాన్‌లో విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న దీపావళి వేడుకలు.. విదేశీ గడ్డపై సంప్రదాయ హోమం!
Police Misconduct | పోలీసుల దారిదోపిడీ..! కానిస్టేబుల్,హోంగార్డుపై కేసు.. కానిస్టేబుల్ పరారీ
Renu Desai | దీపావళి వేడుకల్లో రేణూ దేశాయ్.. ‘చంద్రకోర’ తిలకం ధరించి అందరి దృష్టిని ఆకర్షించిన నటి!
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

