హైదరాబాద్, జూలై 6 (నమస్తే తెలంగాణ): పీజీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహిస్తున్న కామన్ పోస్టు గ్రాడ్యుయేట్ ఎంట్రన్స్ టెస్ట్ (సీపీగెట్) పరీక్షలు శనివారం ప్రారంభమయ్యాయి. ఉస్మానియా విశ్వవిద్యాలయం శనివారం నాలుగు సబ్జెక్టులకు పరీక్షలు నిర్వహించినట్టు టీజీ సీపీజీఈటీ కన్వీనర్ ప్రొఫెసర్ పాండు రంగారెడ్డి తెలిపారు.
తొలిరోజు 7,416 మందికి 6,465 (87.17శాతం) అభ్యర్థులు హాజరయ్యారు. ఈ నెల 16 వరకు 45 సబ్జెక్టులకు పరీక్షలు నిర్వహిస్తారు. ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ ఆర్ లింబాద్రి, సీపీగెట్ కన్వీనర్ ప్రొఫెసర్ పాండురంగారెడ్డి పరీక్షలను పర్యవేక్షించారు.