హైదరాబాద్, జూలై 21(నమస్తే తెలంగాణ): టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్-2025 ఫలితాలను మంగళవారం ఉదయం 11 గంటలకు విద్యాశాఖ కార్యదర్శి విడుదల చేస్తారు. సోమవారం విద్యాశాఖ అధికారులు ప్రకటనలో వెల్లడించారు. జూన్ 18 నుంచి 30 వ తేదీ వరకు తొమ్మిది రోజులపాటు ఈ పరీక్షలు నిర్వహించారు. ఫలితాలను అభ్యర్థులు http: scooledu.telangana.gov.in ద్వారా తెలుసుకోవచ్చని సూచించారు.