హైదరాబాద్, సెప్టెంబర్ 13 (నమస్తే తెలంగాణ) : టీజీఎస్ఆర్టీసీ డ్రైవర్లకు బ్రీత్ ఎనలైజర్ టెస్ట్‌ల పేరుతో ఉద్యోగాల తొలగింపును ఆపాలని కోరుతూ టీజీఎస్ ఆర్టీసీ జాక్ ప్రతినిధులు శుక్రవారం బస్‌భవన్‌లో ఎండీ సజ్జనార్‌ని కలిసి వినతిపత్రం ఇచ్చారు.
బ్రీత్ అనలైజర్ టెస్ట్‌లో రీడింగ్ చూపినప్పుడు ఆ డ్రైవర్ కోరితే రైల్వేశాఖలో మాదిరిగా మరొక బ్రీత్ ఎనలైజర్‌తో టెస్ట్ చేయించాలని, లేదా రక్త పరీక్ష ద్వారా నిర్ధారించాలని కోరారు. కార్యక్రమంలో టీజీఎస్ఆర్టీసీ జేఏసీ చైర్మన్ ఈదురు వెంకన్న, కో కన్వీనర్ సురేష్, జేఏసీ నాయకులు అప్పారావు తదితరులు పాల్గొన్నారు.
తన్నుకున్న అటవీ అధికారులు
సుబేదారి, సెప్టెంబర్ 13 : హనుమకొండ సుబేదారిలోని జిల్లా అటవీ శాఖ కార్యాలయంలో ఇద్దరు అధికారులు సిబ్బంది ముందే తన్నుకున్నారు. వారం రోజుల క్రితం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. జిలాల్లోని అటవీశాఖలో పనిచేస్తున్న రేంజ్ ఆఫీసర్, డిప్యూటీ రేంజ్ ఆఫీసర్ మధ్య డ్యూటీ విషయంలో గొడవలు జరుగుతున్నా యి.