హైదరాబాద్, జూన్ 3 (నమస్తే తెలంగాణ) : పదోతరగతి అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు సోమవారం నుంచి ప్రారంభమయ్యాయి. తొలిరోజు మొదటిభాషకు పరీక్ష నిర్వహించారు. 16,215 మంది విద్యార్థులకు 14,041 (86.59%) విద్యార్థులు పరీక్షకు హాజరైనట్టు ప్రభుత్వ పరీక్షల విభాగం డైరెక్టర్ కృష్ణారావు తెలిపారు.